Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
పూవులలోని పుప్పొడిని తేనె తీగలు పీల్చి తేనెను అందిచిన ట్లుగా కనకా చారి పుప్పొడి పాదా లు కవితల్లో తీయదనం ద్యోతక మవుతుం దని భాష సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ అభినందించారు. కామన్ దా యస్, రవ్వాల కొండ నిర్వహణ లో భాషా సాం స్కృతిక శాఖ సౌజన్యంతో తంగేళ్ల పల్లి కనకా చారి రచించిన పుప్పొడి పాదాలు కవితా సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. ముఖ్య అతిథిగా మామిడి హరికృష్ణ పాల్గొని సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. అక్షరం క్షయం కాని దని, జ్ఞాన కాంతులు అక్షర దీపాలు వల్ల సాధ్య మన్నారు. చారి తన కవితల్లో సామాజిక అంశా లను జ్ఞాన దీపాలవలే అందించారని వివారిం చారు. బోయి భీమన్న ట్రస్ట్ చైర్మెన్ హైమావతి భీమన్న మాట్లాడుతో నిరాడంబరంగా ఉండే చారి కవితలలో అక్షర ఆడంబరం లేకుండా సు లువైన పదాలతో చదివిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి రూప శిల్పి వెంక టేశ్వరచారిని ప్రశంస రూప శిల్పి పుర స్కారంతో సత్కరించారు. నగర గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ప్రసన్న రామమూర్తి, సీనియర్ జర్నలిస్ట్ జనార్దన రావు, తదితరులు పాల్గొన్నారు.