Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
శ్మశానవాటికలకు పది రోజుల్లో మిషన్ భగీరథ తాగునీటి సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. ఆదివారం కలెక్టర్ కార్యక్రమంలోని కాన్ఫరెన్స్ హాలులో మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఇంజనీరింగ్ అధికారులతో మండలాల వారిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 566 శ్మశానవాటిలల్లో ఇప్పటి వరకు 129 శ్మశానవాటిలకు మాత్రమే మిషన్ భగీరథ నీటి సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు. మిగిలిన 437 శ్మశానవాటికలకు వివిధ సమస్యల కారణంగా చేపట్టలేదన్నారు. ఇట్టి పనులను ఏలాంటి సాకులు చూపకుండా సర్పంచుల సహకారంతో పనులను వేగవంతం చేసి, అన్ని సమస్యలను ఆధిగమించి 10 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మండల స్పెషల్ ఆఫీసర్లు, ఏఈలు ఇట్టి పనుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీఆర్డీఓ కృష్ణన్, జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమారి, డీపీవో మల్లారెడ్డి, మిషన్ భగీరథ ఈఈ బాబు శ్రీనివాస్, డీఈలు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.