Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలే మారుతున్నాయనీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి మున్సిపల్ పరిధిలోని ఒకటొవ వార్డు మల్లె మోనిగూడలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్, వార్డు కౌన్సిలర్ వాసియా తబ్బసుమ్ మౌలానతో కలిసి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమం తీసుకువచ్చారని అన్నారు. పరిగి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతు న్నాయని, ముఖ్యంగా సీసీ రోడ్లు, బీటీి రోడ్లు, సైడ్ డ్రైన్లు వంటి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్ర మంతో పట్టణంలోని అన్ని వార్డుల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, బోరుబావులు, తాగునీటి సమస్య, మురుగు నీటి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వేముల కిరణ్ కుమార్, కమిషనర్ ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు, యువకులు స్పెషల్ ఆఫీసర్, పురపాలక అధికారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.