Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందు తున్నాయని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. ఆదివారం పరిగి మండల పరిధిలోని గోవిందాపూర్, మిట్టకోడూరు గ్రామంలో రూప్ సింగ్ తండాలో శ్మశానవా టికలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామాలకు ప్రత్యేక నిధుల ద్వారా గ్రామాల్లో శ్మశానవాటికలు, సీసీరోడ్లు, మిషన్ భగీరథ నీళ్లు, హరిత హారం ద్వారా మొక్కలు పెంచడం, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామాలు సుందరంగా తయార య్యాయని అన్నారు. అంతేకాకుండా గ్రామాల్లో చెత్త ఎక్కడ కనిపించకుండా కంపోస్ట్ షెడ్లను ఏర్పాటుచేసి, ప్రతి గ్రామానికి ఒక కొత్త ట్రాక్టర్ ఇచ్చి వాటిద్వారా చెత్తను తొలగిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా పల్లె ప్రకృతి వనరులతో పచ్చగా కనిపిస్తున్నాయని తెలిపారు. నియోజ కవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగస్వామ్యం తమ పరిసరాలను, ఊరుని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో పరిగి ఎంపీపీ కరణం అరవింద్ రావు, ఎంపీడీవో శేఖర్ శర్మ, ఎంపీటీసీ దూదేకుల జహీరా బీ జహంగీర్, గ్రామ సర్పంచ్‌లు పటేల్ జయలక్ష్మి జగదీశ్వర్, పి.అనసూయ దేవి, నేనావత్ హౌబ్య నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆర్. ఆంజనేయులు, పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, బాలయ్య, జగదీశ్వర్, రవి, తదితరులు పాల్గొన్నారు.