Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
అఫ్జల్‌గంజ్ సమీపంలోని మహారాజ్‌గంజ్ నాలాలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మహారాజ్ గంజ్ మొగారం బస్తీకి చెందిన భరత్ బట్టర్(32) స్థానికంగా గిరిరాజ్ కంపెనీ పేరుతో కెమికల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గడువు ముగిసిన(ఎక్సపైర్ అయినా) కెమికల్స్‌ను కొంతకాలంగా దుకాణం ముందున్న మ్యాన్‌హోల్‌లో పోసేవాడు. ఆదివారం కూడా ఇలాగే గడువు ముగిసిన కెమికల్స్‌ను మ్యాన్‌హోల్‌లో పోశాడు. పోసిన కెమికల్స్ మ్యాన్హోల్లోకి వెళ్లకపోవడంతో మ్యాన్‌హోల్‌కు ఇనుప చువ్వతో కదిలించి పైనుంచి నీటిని పోశాడు. దీంతో ఒక్కసారిగా మ్యాన్‌హోల్ నుంచి పెద్ద శబ్దంతో బ్లాస్టింగ్ అయింది. అక్కడే ఉన్న భరత్ బ్లాస్టింగ్ దాటికి రెండు అంతస్థుల పైకి ఎగిరి కింద పడడంతో అక్కడిక్కడే మతి చెందాడు. ఘటనలో భరత్ తండ్రి వేణు గోపాల్, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భరత్ మతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వేణు గోపాల్, మరో వ్యక్తికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు సంబంధించిన రసాయనాలను క్లూస్ టీం సేకరించి ఎఫ్ఎస్ఎల్ పంపించారు.