Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి
నవతెలంగాణ-మంచాల
ఆనారోగ్యంతో బాధ పడే వారికి, ప్రమాదాలకు గురై గాయాలు పాలైన వారికి సీఎం సహాయ నిధి వరం అని ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని దాథ్పల్లి గ్రామానికి చెందిన కే.నర్సింగ్ రావుకు ఎమ్మెల్యే రూ.60 వేలు సీఎం సహాయ నిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సింగ్‌రావు కొన్ని రోజుల కిందట అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాద్ లోని ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారని అందుకు గాను వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహయనిధి చెక్కును అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చీరాల రమేష్, ఇబ్రాహీం పట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకట రమణ రెడ్డి,పీఏసీఎస్ చైర్మెన్ బస్సు పుల్లరెడ్డి, నాయకులు జంబుల కిషన్ రెడ్డి,సత్యనారాయణ ఇబ్రహీం పట్నం టి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు చిలుక బగ్గారాములు తదితరులు ఉన్నారు.