Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 400 మంది రైతులకు అసైన్డ్ భూములు
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ-వికారాబాద్ రూరల్
అసైన్డ్ భూములలో పంటలు వేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అటవీ అధికారులకు సూచించారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 'మీతో నేను' కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని మదన్‌పల్లి గ్రామంలో పర్యటించారు. ఈ కార్య క్రమంలో గ్రామంలోని అన్ని ప్రధాన రహదారులు కలియ తిరుగుతూ గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. మదన్‌పల్లి గ్రామంలో దాదాపుగా 400 వందల మంది రైతులు అసైన్డ్ భూములపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, వర్షాకాలం రావడంతో పంటలు పెట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు భయాందోళనకు గురి చేస్తున్నారని ప్రజలు తెలపగా ఎమ్మెల్యే రెవెన్యూ శాఖ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అసైన్డ్ భూముల్లో పంటలు వేసుకునేందుకు రైతులను ఇబ్బంది పెట్ట రాదని, అటవీ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు సమీక్ష చేసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమ స్య పరిష్కారం కావాలని ఆదేశించారు. రైతులను అటవీ అధికారులు భూమి సాగు కానీ, పంటలు వేయకుండా ఇబ్బంది పెట్టకూడదని అటవి అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పాడుబడ్డ ఇండ్లు, పెంట కుప్పలు, పిచ్చి మొక్కలు, ఖాళీస్థ లాల పరిశుభ్రత, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. గ్రామంలో వెంటనే థర్డ్ వైర్ ఏర్పాటు చేసి పాత ఐరన్ స్తంభాలను తొలగించాలని, నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్థంబాలకు వైర్లు ఏర్పాటు చేసి, పాత స్థంబాలు తొలగించి, వెంటనే విద్యుత్ సరఫరా అందించాలని, గ్రామంలో పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని, విద్యుత్ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ మంచినీటి నల్లా కనెక్షన్ ప్రతీ ఇంటికి కచ్ఛితంగా ఇవ్వాలని, గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి, అన్ని వార్డులకు సరిప డా నీటిని అందించాలని, ఎక్కడ కూడ లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ... నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రజలు సురక్షితమైన మిషన్ భగీరథ తాగు నీటినే తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్తయ్య, గ్రామ సర్పంచ్ రాజు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.