Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశుభ్రతపై చర్యలు తీసుకుంటాం
- పట్టణ ప్రగతిపై పర్యటనలు
- ఛైర్పర్సన్ రేఖాయాదగిరి
నవతెంలగాణ-గండిపేట
బడిలో ప్రగతిని వెలిగించాలని ఛైర్పర్సన్ దార్గుపల్లి రేఖాయాదగిరి అన్నారు. సోమవారం నార్సింగి మున్సిపాలిటీలోని 'మన ఊరు-మన బడి', పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బడిలో అన్ని వసతులను కల్పించాలన్నారు. చెట్లు, చెత్త చెదారం తొలగించమన్నారు. పరిసరాలను పరిశుభ్రతను పాటించాలన్నారు. తాగునీటి వసతి, మరుగుదొడ్డి, విద్యుత్ సమస్య విద్యార్థులకు ఎ లాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. తాగునీటి వసతిని ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యమైన భోజనం ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. బడీడు పిల్లలందరినీ బడిలోనే చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంల్లో కౌన్సిలర్ యాదమ్మ, మేనేజర్ యోగేష్, ఆర్ఐ అఖిల్, ప్రత్యేక అధికారి మహబుబ్ పాషా, సూపర్వైజర్ పాషా, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.