Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్గాలకు వీడిపోయిన వికారాబాద్ కౌన్సిలర్లు
- చైర్మెన్ గిరి కోసం కుమ్ములాట
- మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్..
- అమీతుమీకి.. సై
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
నిన్న మొన్నటి వరకు కలిసి మెలిసి అభివృద్ధి కోసం భాగస్వాములయ్యారు. ఇవాళ చైర్మెన్ పదవి కోసం రాజకీయ శత్రువులయ్యారు. నిన్నటి వరకు ఎంతో ఇష్టంగా మాట్లాడుకుంటున్నా వాళ్ల మధ్య మాటల్లేవ్ మాట్లాడుకో వడాల్లేవ్. పట్టణ అభివృద్ధి అంతా అధికారులకు వదిలేసి .. చైర్‌పర్సన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం అంటున్నారు.. ఓట్లేసిన జనం ఇదేమి విచిత్రమని ముక్కున వేలేసుకొని చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గిరి కోసం రోజురో జుకూ వాతావరణం వేడెక్కుతుంది. అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ అంత ర్గత ఒప్పందం ప్రకారం ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ మంజులరమేష్ పదవి దిగాలని నిన్నటి వరకు ఆమె వెనకాల ఉన్న కౌన్సిలర్ల బృందం ఇవాళ ఆమెకు వ్యతిరేకం గా పట్టుబట్టారు. అభివృద్ధి ఇతర విషయాల పట్ల మంచి వాతావరణంలో మాట్లాడుకొని అభివృద్ధి పనులు కలిసి మెలసి చేస్తున్న కౌన్సిలర్లు అందరూ చైర్పర్సన్ మంజుల రమేష్ ఫోన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించారు. చైర్ పర్సన్‌తో మాట్లాడకూడదని నిర్ణయించారు. ప్రజల సమస్యల పట్ల మాట్లాడాల్సి వస్తే అధికారులతో పనులు చేయించుకోవాలని నిర్ణయించారు. ఒక మాటలో చెప్పా లంటే భౌతికంగా చైర్ పర్సన్ మంజులరమేష్ని కౌన్సిలర్లు అంతా బహిష్కరించాలని నిర్ణయించారు. అధికారులతో పాటు ఆమె వివిధ వార్డుల్లో పర్యటిస్తే వారికి సహకరిం చకూడదని నిర్ణయించారు. చైర్ పర్సన్‌పై విమర్శలతో పాటు విధినిర్వహణలో ఆమె భర్త పెత్తనం గురించి మొదటిసారిగా ప్రశ్నించారు. గమ్మత్తేమిటంటే నిన్నటి వరకు చైర్ పర్సన్ మంజులరమేష్తో పాటు కౌన్సిలర్ లంతా కలిసి పని చేస్తే అవార్డులు రివార్డులు వచ్చాయని చెప్పుకొచ్చిన కౌన్సిలర్లు ఇవాళ చైర్‌పర్సన్‌కు దూరంగా ఉండాలని ఎందుకు నిర్ణయించారో కౌన్సిలర్లు చెప్పడం కాదు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. చైర్మన్ పదవి పంపకాలు ఉంటే ప్రజల నెత్తిన రుద్దెకంటే అంతర్గతంగా చర్చించుకుని అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకో వాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. పదవి కోసం రచ్చ రచ్చ ఎందుకంటూ పట్టణ పౌరులు ప్రశ్నిస్తున్నారు. పాలకులు ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.