Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటి రోజు 25 శాతం విద్యార్థుల హాజరు
- 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో నేటికీ సుమారు 250 మంది విద్యార్థులు మొగ్గు
నవతెలంగాణ-కొత్తూరు
వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థులు బడిబాట పట్టారు. వేసవి సెలవులను సంతోషంగా గడపడానికి అమ్మమ్మగారింటికి, బంధువుల ఇళ్లలోకి వెళ్లిన విద్యార్థులు తిరిగి బాధతో ఇంటి బాట పడుతున్నారు. గ్రామాల్లో ఉన్న టువంటి పిల్లలు ఇంకా పూర్తిస్థాయిలో ఇళ్లలోకి చేరుకో లేదు. దీంతోపాటు ఎండ తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో పాఠశాల వద్ద మొదటిరోజు విద్యార్థులు పలుచగా కని పించారు. మండలంలో వివిధ గ్రామాలలో మొదటిరోజు 25 శాతం హాజరు శాతం నమోదైంది.
మండలంలోని వివిధ గ్రామాల్లో కొన్ని రోజులుగా 'మన ఊరి-మన బడి' కార్యక్రమం మండల విద్యాధికారి కిస్టారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాల్లోని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి వారి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన, సౌకర్యాల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. మొదటి తరగతిలో చేరడానికి సుమారు 250 మంది విద్యార్థుల వివరాలను నమోదు చేసుకున్నామని ఏమ్ఈఓ కిష్టారెడ్డి తెలిపారు.
'మన ఊరు-మన బడి' విజయవంతం
మండలంలోని వివిధ గ్రామాల్లో 'మన ఊరు-మన బడి' కార్యక్రమాన్ని విజయ వంతంగా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలలో తమ పిల్లలను చేర్పించడానికి తల్లి దండ్రులు ముందుకు వస్తున్నా రు. మా ఉపాధ్యా యులు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బోధన మెరుగైన సౌకర్యాల పట్ల వారికి అవగాహన కల్పిస్తూ విద్యార్థులు పాఠశాలలో చేర్పిస్తున్నారు. ప్రస్తుతం నేటికి సుమారు 250 మంది విద్యార్థుల వరకు మొదటి తరగతిలో చేరడానికి సిద్ధమయ్యారు.
- కిష్టారెడ్డి, మండల విద్యాధికారి కొత్తూరు.