Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత్స్యకారుల నినాదాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
- మత్స్యకారులను విస్మరిస్తున్నా ప్రభుత్వం
- రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహా
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కబ్జా కోరల నుంచి జిల్లాలోని చెరువులు, కుంటలను కాపాడాలని మత్య్సకారుల సంఘంం రాష్ట్ర అధ్యక్షులు గొరెంకల నర్సింహ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడించారు. మత్స్యకారుల నినాదాలతో జిల్లా కలెక్టరేట్ దద్దరిల్లింది. మత్య్సకారులు కలెక్టరేట్లోకి తోసుకు రాకుండా పోలీసుల బారెకెడ్లను ఏర్పాటు చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత చేప పిల్లలకు బదులుగా మత్స్య సోసైటీల బ్యాంకు ఖాతాల్లో రూ.5లక్షల నగదు జమ చేయాలన్నారు. చెరువులు, కుంటలను భూకబ్జాదా రుల నుంచి రక్షించాలని డిమాండ్ చేశారు. ప్రతి మత్స్యకార సొసైటీకి రూ.10 లక్షల చొప్పున 100 శాతం సబ్సిడీతో రుణాలు ఇవ్వాలన్నారు. 50 ఏండ్లు నిండిన ప్రతి మత్స్యకారుడికి వెంటనే రూ.5 వేల పింఛన్ ఇవ్వాలన్నారు. వర్షాలకు గండ్లు పడిన చెరువులు, కుంటలను ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. సహజ మరణం చెందిన మత్స్యకారులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాల న్నారు. జిల్లాలో సుమారు110 మత్స్య సోసైటీలు న్నాయన్నారు. మత్స్యకారులు చేపలకు ఎరవేసి చేపలు పట్టినట్టు ఎన్నికల ముందు పాలకులు తమకు మోటార్ సైకిళ్ళు, ఫోర్ వీల్లర్ బండ్ల పేరుతో ఎర వేసి ఎన్నికల తర్వాత చేతులు దులుపు కుంటున్నారన్నారు. గత సంవత్సరంలో వేసిన చేప పిల్లల ఇప్పటికీ 100, 200 గ్రాముల కంటే ఎక్కువ సైజు పెరగలేదన్నారు. నాసిరకం చేప పిల్లలు ఇవ్వడం, ఇచ్చే చేప పిల్లలు కూడా సీజన్ సమ యంలో కాకుండా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఇస్తుండ టం వలన మత్స్యకారులకు తీవ్రమైన నష్టం జరుగుతుం దన్నారు. జిల్లాలో చెరువులు, కుంటలు పట్టణీకరణ, పరి శ్రమలు, రియల్ ఎస్టేట్ల పేరుతో జిల్లాలో చెరువులు, కుంటలను ధ్వంసం చేస్తున్నాయన్నారు. మత్య్సకారుల ఆం దోళన కారణంగా పార్కింగ్ స్థలం నుంచి కలెక్టరేట్ వరకు వందలాది మత్స్యకారులు ప్రదర్శనగా వచ్చి రోడ్డుపై గంట పాటు బైఠాయించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అందోళన నిర్వహించారు. కలెక్టనేట్ గేటు ముందు ఉన్న బారి కేడ్లను చేదించుకుని లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్ మత్స్యకారుల వద్దకు వచ్చి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు చెనమోని శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ మల్లెష్, పూల గాజుల జంగయ్య, పి.కొండల్, పి.శంకర్, ఆర్ రాజు, అన్నెపు చంద్రయ్య, వెంకటేష్, నర్సింహా, అశోక్, మహేందర్, క్రిష్ణ, సురేష్, మహేష్, మంజుల, మంగమ్మ, బాల్ నర్సింహా, శంకర్ తదితరులు పాల్గొన్నారు.