Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ అడిషనల్ డీజీపీ వై.నాగిరెడ్డి
- ఘనంగా కళాశాల దినోత్సవం
నవతెలంగాణ-రాజేంద్రనగర్
వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చులు తగ్గించడానికి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేయాలని తెలంగాణ అడిషనల్ డీజీపీ వై.నాగిరెడ్డి అన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి కల్చర్ యూనివర్సిటీలో జరిగిన కళాశాల దినోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడుతూ కాలేజీ డే కి రావడం చాలా సంతో షంగా ఉందనీ, ఎంత మంది తిరిగి వ్యవసాయ రంగంలో స్థిరపడతారని విద్యార్థులను అడిగారు. సివిల్స్‌కు వెళ్లాలని ఆశించేవారు పూర్తిగా ఇంటలి జెంట్ కావాల్సిన అవసరం లేదనీ, కానీ బాగా కష్టపడి చదవాలని సూచించారు.బ్యాంకింగ్ రంగం లోకి రావాలంటే షార్ప్‌గా ఉండాలనీ, విదేశాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నా యన్నారు. విశ్వ విద్యాలయం ఇతర సంస్థలతో అను సందానం చేసుకోవడం మంచి పరిణామన్నారు. ఇండిస్టీకి విశ్వవిద్యాలయం నమ్మకం కలిగిస్తే టై అప్స్ బలంగా ఉంటాయన్నారు. మార్కెట్ ఓరియం టెడ్ పరిశోధనలు చాలా అవసరమని వివరించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ వివిధ జనరేషన్స్ క్రమంలో ప్రస్తుత ఉన్న తరం 'ఆల్ఫా' తరంగా ఆయన అభివర్ణించారు. ఈతరం రాబోయే 20 ఏండ్ల ఎలా ఉండాలనే దృక్పథాన్ని కలిగి ఉండా లన్నారు. ప్రస్తుత పరిస్థితులు, మారుతున్న పరిస్థి తులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చు కోవాలని సూచించారు. ప్రస్తుతం వివిధ దేశాలు తీసుకునే నిర్ణయాలు ఇతర దేశాలను కూడా ప్రభావితం చేస్తున్నాయన్నారు. గడిచిన 70 ఏండ్ల లోనే ఎంత ఉత్పత్తిని సాధించాలని ఆలోచించాం, కానీ ప్రస్తుతం మార్కెట్, కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ ఆధారిత అంశాలపై దృషి సారించాలని సూచిం చారు. ఈ సందర్భంగా కాలేజ్ మ్యాగజిన్‌ను ఆవి ష్కరించారు. ఉపకులపతి వి. ప్రవీణ్‌రావు, ముఖ్య అతిథిగా హాజరైన వై.నాగిరెడ్డిని సన్మానించారు.
కళాశాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 4వ నుంచి 9వ తేదీ వరకూ నిర్వహించిన క్రీడల పోటీలు బాలుర విభాగంలో పీజీ అండ్, పీహెచ్డీ విద్యార్థులు దక్కించుకోగా, బాలికల విభాగంలో బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థులు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా అథ్లెటిక్స్ ఇండి విడ్యువల్ ఛాంపియన్ షిప్ బాలుర విభాగంలో ప్రిన్స్‌రాజ్ కైవసం చేసుకోగా, బాలికలలో పి. వైభవి, మూడో సంవత్సరం విద్యార్థిని దక్కించు కుంది. సాంస్కతిక, సాహిత్య, సృజనాత్మకత చాంపి యన్‌షిప్‌ను బీఎస్సీ చివరి సంవత్సరం విద్యార్థులు కైవసం చేసుకున్నారు. విజేతలకు బహుమతులను అందజేశారు. కళాశాల దినోత్సవం సందర్భంగా విద్యార్థినీ,విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృ తిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఉన్నతాధి కారులు తదితరులు పాల్గొన్నారు.