Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
అతిసారవ్యాధి నివారణకు ఓఆర్ఎస్, జింకును లిక్విడ్ ప్యాకెట్లు పిల్లలకు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం కందుకూరు మండల పరిధిలోని రాజులూరు గ్రామంలో అతిసార వ్యాధి నివారణకు ఓ ఆర్ ఎస్, జింకు, కేంద్రాన్ని సర్పంచ్ శ్రీనివాస్ చారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు విరేచనాలు అయినప్పుడు ఓ ఆర్ ఎస్, జింకు లిక్విడ్ ప్యాకెట్లను ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఉప సర్పంచ్ శివ శంకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురసాని సురేందర్ రెడ్డి, సర్పంచులు కాసుల రామకృష్ణ, యాల శ్రీనివాస్, బక్క మహేష్, మంద సాయిలు, నాయకులు జీ. సామయ్య, మేఘనాథ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి, దామోదర్ గౌడ్, శేఖర్ గుప్తా, వైద్యులు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.