Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనంతుని సాక్షిగా అనంతగిరిలో ఒప్పందం
- వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ లంక పుష్పాలత రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ రూరల్
వికారాబాద్ మున్సిపల్ చైర్మెన్ సిటు విషయంలో ఎన్నికలు ముగిసిన తరువాత రెండునరేండ్లు ఒకరికి, మరో రెండేండ్లు మరొకరికి అని ఒప్పందాలు కుదుర్చున్న తర్వాతే వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చిగుళ్లపల్లి మంజుల రమేష్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా భాద్యతలు చేపట్టడం జరిగిందని కౌన్సిలర్ లంక పుష్పాలత రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని లంక పుష్పాలత రెడ్డి నివాసంలో మున్సిపల్ కౌన్సిలర్లతో విలేకర్ల సమావేశం నిర్వహించారు. గత వారం రోజులుగా వికారాబాద్ మున్సిపల్ ో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ల అగ్రీమెంట్ల విషయంలో రచ్చ జరుగుతుంది. ఈ సందర్భంగా కౌన్సిలర్ లంక పుష్పాలత రెడ్డి మాట్లాడుతూ..వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పదవి చేపట్టే సమయంలో తాను కూడా మున్సిపల్ చైర్పర్సన్ రేసులో ఉన్నపుడు రెండున్నరేండ్లు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే సమక్షంలో కౌన్సిలర్ల అందరి మధ్యలో ఆనంతగిరిలోని అనంత పద్మనాభ స్వామి సాక్షిగా ఒప్పందాలు జరిగాయన్నారు. కానీ ఇప్పుడు వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ ఒప్పందాలు ఏవి లేవని అన్నడం సరికాదనీ, ఒక వేళ ఒప్పందలు ఉన్నాయని ప్రూఫ్ చేస్తే మున్సిపల్ చైర్ పర్సన్ పదవికి ఇప్పుడే రాజీనామా చేస్తావా అని సవాళ్లు విసిరారు. కరోనా సమయంలో తానే మున్సి పల్లో మొత్తం సేవ చేశానని గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. కౌన్సిలర్లు అందరూ కూడా వారి వార్డులో సేవలను చేశారని, 'నువ్వు మున్సిపల్‌కు బాస్ కాబట్టి అన్ని వార్డులను పరిశీలించడం నీ బాధ్యత' అని గుర్తు చేశారు. వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఒప్పదం ప్రకారం ఉందని, వికారా బాద్ ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిందని, ఎమ్మెల్యే ఆనంద్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దష్టికి, మంత్రి సబితా రెడ్డి దష్టికి కూడా తీసుకువెళ్ళిన్నట్టు వెల్లడించారు. ఒప్పందం లేదని అంటున్న మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ ఒప్పందం ఉంటే రాజీనామా చేస్తావా? ఒప్పందం లేకపోతే తాను కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పదవి కూడా ఒప్పందం ఉందని గుర్తు చేశారు.టీఆర్ెఎస్ పార్టీ నష్టానికి విఘాతం కలిగిస్తే చర్యలు ఉంటాయని,దీనితో సహాయ నిరాకరణ అవసరం ఉందన్నారు.అధిష్టానం ఎవరిని మున్సిపల్ చైర్పర్సన్ స్థానంలో కూర్చోబెడితే వారే ఉందమని,అధిష్టానం తమను చైర్పర్సన్ స్థానంలో కూర్చోబెటకపోతే తప్పుకుంటామని అన్నారు. అప్పట్లో దొడ్డి దారిన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నియామకం చేశారని, ఎంఐఎం పార్టీ నాయకులతో కేటీఆర్ పైన ఒత్తిడి చేసి వైస్ చైర్ పర్సన్‌గా శంషాద్ బేగం బాధ్యతలు చేపట్టారని కౌన్సిలర్ సురేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకు గాను వైస్ చైర్మన్ పదవి కూడా మరొకరికి ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి,కౌన్సిలర్లు ఉన్నారు.