Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేషన్ డీలర్‌ని తొలగించాలని తహసీల్దార్‌కు వినతి
నవతెలంగాణ-బంట్వారం
బంట్వారం మండల పరిధిలోని బొపునా రం గ్రామంలో రేషన్ డీలర్‌ని మార్చాలంటూ గ్రామస్తులు గురువారం మండల తహసీల్దా ర్కు వినతి పత్రం అందజేశారు. బొపునారం గ్రామంలో రేషన్ డీలర్ చాంద్ పాషా రేషన్ దుకాణాన్ని తన ఇంట్లోనే కొనసాగిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన తూకం చేయకుండా లబ్దిదారులు తీసుకుపోయే సంచిలో తూకం వేయకుండా తను వేసిన సంచిలో తూకం వేస్తున్నాడని తెలిపారు. దీంతో ప్రతీ రేషన్ దారుడు 1/2 కిలో రేషన్ నష్టపోతున్నారని అన్నారు. రేషన్ దుకాణాన్ని డీలర్ ఇంట్లో కాకుండా వేరే చోటుకు మార్చి రేషన్ లబ్దిదారులకు మేలు జరిగేలా చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో గొల్ల మైపాల్, తవ్వ యేనప్ప, దావిద్, నర్సిరెడ్డి, బక్కరెడ్డి, గోపాల్, గ్రామస్తులు పాల్గొన్నారు.