Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాలాల ఎంపీపీ టి.బాలేశ్వర్ గుప్తా
నవతెలంగాణ- యాలాల
రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో విత్తనాలు విత్తి పంటలు సాగు చేయాలని యాలాల ఎంపీపీ టి.బాలేశ్వర్ గుప్తా అన్నారు. గురువారం సాయంత్రం యాలాల మండల ప్రజాపరిషత్ సమావేశం హాల్లో ఎంపీపీ అధ్యక్షతన ఎన్ఎఫ్ఎస్ఎం కింద వ్యవసాయశాఖ అద్వర్యంలో విత్తనాల పంపిణీ కార్యక్రమా న్ని ఎంఏఓ యాదగిరి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అథితిగా హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాల వలన రాలేకపొయారు. ఎంపీపీ బాలేశ్వర్ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం అందించే మేలు వంగడాలతో రైతులు అధిక దిగుబడులు రాబట్ట వచ్చన్నారు. విత్తనాల పంపీణీతో మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని రుజువైందని పేర్కొన్నారు. ఒక్కో రైతుకు నాలుగు కిలోల కందుల బస్తా ఉచితంగా ప్రభుత్వం ఇవ్వనుందని చెప్పారు. రైతులు రైతు వేదిక భవనాల క్లష్టర్ల దగ్గల సమీప ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమేష్, కో-ఆప్షన్ మెంబర్ అక్బర్ బాబ, మండల క్లష్టర్ల ఏఈఓలు, టీఆర్ఎస్ యాలాల మండల అధ్యక్షులు రవీందర్రెడ్డి, వివిధ గ్రామాల రైతులు, నాయకులు పాల్గొన్నారు.