Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
- తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీ కెమెరాలను
- ప్రారంభించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-తాండూరు
ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి సీసీి కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న నేరాల అదుపునకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతా యని అన్నారు. మార్కెట్ యార్డ్లో సీసీ కెమెరాలు అవసరం ఎంతగానో ఉందన్నారు. రైతుల ధాన్యానికి నిరంతరం నిఘా ఉంటుందన్నారు. మార్కెట్ యార్డ్లో పది లక్షల రూపాయలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘాలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ విట్టల్నాయక్, వైస్ చైర్మెన్ వెంకట్రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి రాజేశ్వరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.