Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సోషల్ జస్టిస్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-షాద్ నగర్
కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం తగదని, పోలీసుల దౌర్జన్యాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు సహించబోరని సోషల్ జస్టిస్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వీర్లపల్లి శంకర్ హెచ్చరించారు. రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా హిం సాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసుల లాఠీచార్జిలో వీర్లపల్లి శంకర్, చంద్రపాల్ రెడ్డిలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీర్లపల్లి శంకర్ కాలి వేళ్ళ ఎముకలు చిట్లినట్టు డాక్టర్లు తెలిపారు. అదేవిధంగా చంద్రపాల్ రెడ్డి చేయి ఎముక విరిగింది. ఇరువురిని చికిత్స నిమిత్తం కాంగ్రెస్ శ్రేణులు ఆస్పత్రికి తరలించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మైండ్ గేమ్‌లోనే ఈడీని రంగంలోకి దించారని ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. రాహుల్ గాంధీని ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు పిలిచిన నేపథ్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని రాజ్ భవన్ ముట్టడి సందర్భంగా ఆగ్ర హం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను కూడా పార్లమెంట్లో ఎప్పటికప్పుడు నిలదీస్తుండడంతో బీజేపీకి మింగుడుపడడం లేదన్నారు.ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్లో బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబం దేశ రాజకీ యాల్లో ఉండకూడదని, గాంధీ అనే మాట వినబడ కూడదనే దుర్మార్గమైన ఆలోచనతో నీచమైన రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయుల కు వ్యతిరేకంగా గాంధీతో పాటు నెహ్రూ కూడా జైలు జీవితం గడిపారన్నారు. ఇందిర, రాజీవ్ గాంధీలు దేశ ప్రజల కోసం బలిదానమయ్యారని, ఇదో పెద్ద చరిత్ర అని అన్నారు. స్వాతంత్య్రం, దేశ ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన ఒక్క నాయకుడైనా బీజేపీలో ఉన్నారా? గుండెపై చెయ్యి వేసుకోని చెప్పాలని సవాల్ చేశారు. వచ్చే పార్లమెం టు ఎన్నికలకు సోనియా, రాహుల్‌లు సమయాత్తమవ్వ కుండా వ్యుహాత్మకంగా ఆర్ఎసఎస్, బీజేపీ ఈడీ ద్వారా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. సోనియా, రాహుల్ లను ఎన్నిసార్లు ఈడీ ఆఫీసుకు పిలిచినా, ఇబ్బంది పెట్టినా ఈడీ ఆఫీసు, రాజ్ భవన్ ముందే కూర్చుంటామని, ఎక్కడా వెనక్కి తగ్గేది లేదన్నారు.