Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
పరిగి పట్టణ కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, ప్రభుత్వ ఆస్పత్రి సందర్శించడానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావు కాన్వారుని యూత్ కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు వారిని పట్టుకొని పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందే కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సంద ర్భంగా డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్ కృష్ణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో పర్యటనలుచేసె మంత్రులకు భయమేందుకు అని ప్రశ్నించారు. పరిగి నియోజక వర్గంలో ముఖ్యమంత్రి కేేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు కానీ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రి కూడా గతంలో పరిగిలో అనేక హామీలు ఇచ్చారన్నారు. ఇట్టి విషయంలో మెమోరండం ఇవ్వాలని చూస్తే ముందుగానే కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారని అన్నారు. పరిగి మండల పరిధిలోని లక్నాపూర్ ప్రాజెక్టును మినీ ట్యాంక్ బండ్ చేస్తానని చెప్పారనికానీ నేటికీ పూర్తి కాలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి నాలుగేండ్ల క్రితమే ప్రభుత్వ ఆస్పత్రి కట్టిస్తే ఇప్పటి పూర్తిస్థాయిలో డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు పూర్తిస్థాయిలో లేరన్నారు. గతంలో ప్రారంభించిన క్యాంపు ఆఫీసును మళ్లీ ప్రారంభిం చడం అభివృద్ధి అవుతుందా అని ప్రశ్నించారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుభాష్, చందర్ రెడ్డి, అంజనేయులు, నాగవర్ధన్, కౌన్సిలర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.