Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ నియోజకవర్గానికి ఇటీవల మంజూరైన డిగ్రీ కాలేజ్‌ను రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేయాలని గాంధీనగర్, హనుమాన్ నగర్, బుద్వేల్ బస్తీ వాసులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా మంజూరైన డిగ్రీ కాలేజ్‌ను రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు. రాజేందర్‌నగర్‌లో వివిధ జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రాలు ఉన్నాయనీ, అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఉద్యాన కళాశాల, వెటర్నరీ కళాశాల ఇక్కడే ఉందన్నారు. రాజేంద్రనగర్ ఎడ్యుకేషన్ హబ్‌గా మారిందనీ, డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. రాజేంద్రనగర్ ఇంటర్ కాలేజీలో ప్రస్తుతం 650 మంది విద్యార్థులు చదువుతున్నారని ఎమ్మెల్యేకు వెల్లడించారు. ఇక్కడే డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తే గండిపేట్, నార్సింగ్, కిస్మత్పూర్, బండ్లగూడ, అత్తాపూర్, సులేమాన్ నగర్, మైలార్‌దేవ్‌పల్లి ఈ ప్రాంత విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ స్పందించి, మాట్లాడుతూ విద్యార్థులందరికీ అనుకూలమైన ప్రాంతంలో డిగ్రీ కాలేజీలో ఏర్పాటు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ, రాజేందర్ నగర్ వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల రమేష్, నరసింహ, రాజేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.