Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 149 బ్యాంక్ అకౌంట్స్ నుంచి దాదాపు రూ.14 లక్షల 65వేల విత్ డ్రా
- ఫేక్ ఫింగర్ ప్రింట్స్ ఉపయోగించి
- విత్ డ్రా చేసిన దుండగులు
- వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర
నవతెలంగాణ-మియాపూర్
నకిలీ వేలిముద్రలను తయారు చేసుకుంటూ బ్యాంకు ఖాతాలోని డబ్బులు మాయం చేస్తున్న ముఠాను సైబరా బాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. హైదరాబాద్ అల్వాల్‌లో రారు నె ట్ సర్వీసెస్ అనే సంస్థ ఏర్పాటు చేసిన నిందితుడు నాగ మల్ల వెంకటేష్ ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక డేటా సెంటర్ ఆపరేటర్‌గా పని చేసి ల్యాండ్ అండ్ రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్‌కు సంబంధించిన ఏపీ స్టేట్ పోర్టల్ (ఐ జి ఆర్ యెస్) వెబ్ సైట్ లో పొందుపరిచిన డాకుమెంట్స్ ఫింగర్ ప్రింట్స్ సేకరించాడు. ఈసీ పాయింట్ అనే అప్లికేషన్ ద్వా రా నిందితుడు ఆయా బ్యాంక్ ఖాతాల నుంచి వారి నకిలీ వెలి ముద్రల ద్వారా నగదు డ్రా చేస్తున్న ముఠా.. మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3.4 లక్షల నగదు, 121 సిం కార్డులు, 20 మొబైల్ ఫోన్లు, 13 డెబిట్ కార్డ్‌లు, ఫింగర్ ఫ్రింట్కు ఉపయో గించే సామగ్రిని సీజ్ చేశారు. గతంలోనూ ఇలాంటి ముఠాలు గుర్తించామని అయితే టెక్నాలజీ సాయంతో ఇలాంటి ముఠాలు మళ్లీ కనిపిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
మధ్యప్రదేశ్ రాష్ట్రం దార్ డిస్ట్రిక్ట్‌కు చెందిన అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఇప్ప టివరకు మొత్తం 98 కేసులలో నిందితులుగా ఉన్నారు. సైబరాబాద్‌లో 68, నిజామాబాద్‌లో 10, కరీంనగర్లో 02, వరంగల్‌లో 06, జగిత్యాలలో 09, కామారెడ్డిలో 02, సిద్దిపేట లో 01 కేసులు నమోదు అయ్యాయి. అందరూ మధ్యప్రదేశ్ రాష్ట్రం దార్ డిస్ట్రిక్ట్‌కు చెందినవారు. మొత్తం 11 మంది నిందితులు ఒక ముఠాగా ఏర్పడి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగతనంలో వాడే ప్రధాన వస్తువులు భారీ కట్టర్స్, రాడ్స్, స్క్రూ డ్రైవర్స్‌తో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. మొత్తం 11 మంది నిందితుల్లో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ కేసును ఛేదిం చిన కానిస్టేబుల్, ఇతర ఆఫీసర్లకు నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, బాలనగర్ డీసీపీి సందీప్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.