Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యాయం చేయాలని ఎంపీపీ, జెడ్పీటీసీ, తహసీల్దార్‌కు వినతి
నవతెలంగాణ-కందుకూరు
సీలింగ్ ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా చూపించి, విక్రయాలకు పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం బాధితులు ఎంపీపీ మంద జ్యోతి, జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, కందుకూరు తహసీల్దార్ జ్యోతికి వినతిపత్రం అందజేశారు. దావూద్గూడా గ్రామానికి చెందిన ఆర్. శ్రీశైలం నాయక్, మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామానికి చెందిన తోట రవీందర్‌లకు వినతిపత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ పులిమామిడి గ్రామ రెవెన్యూ దావూద్గూడలో సర్వే నెంబర్ 84/1 లో అసైన్డ్ భూమి, ప్రభుత్వ భూమి సుమారుగా 11 ఎకరాలు ఉందని, ఈ భూమిని సీలింగ్ పట్టా కాదనీ, పట్టా భూమి అని, పట్టా పాసు పుస్తకాలు చూయించిన సర్పంచ్ విజయ భర్త రాజు నాయక్ సంవత్సరం క్రితం తమకు భూమి అమ్ముతామని చెప్పి, తమ వద్ద రూ.35 లక్షలు తీసుకున్నారని తెలిపారు. ఆ భూమిని కందుకూరు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల్లో పరిశీలించగా ప్రభుత్వ భూమిగా ఉందని, తాము మోసపోయామని, రికార్డు పరిశీలించాకే తెలుసుకున్నామనీ వారు ఆందోళన వ్యక్తం చేశారు.తాము ఇచ్చిన డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని కోరగా రాజునాయక్ బెదిరింపులకు పాల్పడుతున్నాడనీ, ఆయనపై తగు చర్యలు తీసుకుని, తమకు డబ్బులు పంపించాలని అధికారులను కోరారు.