Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
నవతెలంగాణ-మియాపూర్
పట్టణాలు, పల్లెలు అన్ని రంగాల్లో సమగ్ర అభి వృద్ధే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుం దని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. పట్టణ ప్రగతి కార్యాక్రమంలో భాగంగా గురువారం గచ్చిబౌలి డివిజన్లోని బస్తీలల్లో, కాలనీ లో పర్యటించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నాల్గొ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి బస్తీల్లో, కాలనీలో పేరుకు పోయిన చెత్త తొలగించి, డ్రయినేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడూ శుభ్రం చేయాలనీ,పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులను, కార్పొరేటర్లకు ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా నేపథ్యంలో పారిశుధ్య కార్మికులు ఎనలేని కృషి చేశారనీ, ప్రతి ఒక్కరూ వారిని గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబా, అధికారులు ఈఈ శ్రీనివాస్, డీఈ విశాలాక్షి, ఏఈ సునీల్, జలమండలి డీజీఎం శ్రీమన ్నారాయణ,నగేశ్నాయక్, స్ట్రీట్ లైట్స్ రాజశేఖర్, భరత్ మాజీ కౌన్సిలర్ సుబ్బారావు, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.