Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే మేము రాకుండా ఉపసర్పంచ్‌లను పంపిస్తాం
- సర్వసభ్య సమావేశానికి హాజరుకానీ అధికారుల తీరుపై సర్పంచ్ల ఆగ్రహం
- అన్ని గ్రామాలు అభివృద్ధి చేయాలి:ఎంపీపీ అనురాధా రమేశ్
నవతెలంగాణ-వికారాబాద్ డెస్క్
పెద్దమూల్ మండంలంలో మూడు నెలల కోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి మండల శాఖ అధికారులు రాకపోతే.. సర్పంచులు రాకుండా ఉపసర్పంచులను సమావేశానికి పంపి స్తామని పలువురు సర్పంచులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. గురువారం పెద్దేముల్ మండల్ పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అనురాధ రమేష్ అధ్యక్ష తనలో మండల సర్వసభ్య సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశానికి సంబంధిత మండల శాఖ అధికారులు రాకుండా కిందిస్థాయి సిబ్బందిని పంపించడంతో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీ డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వసభ్య సమా వేశానికి రాని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనురాధ రమేశ్,జడ్పీటీసీ ధారాసింగ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో సమస్యలు లేకుండా గ్రామ అభివృద్ధి చూసే బాధ్యత అధికారులపై ఉందన్నారు.బడి బయట ఉన్న పిల్లందరినీ బడిలో చేర్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధిలో స్థానిక సర్పంచ్‌లు,ఎంపీటీసీల సహకారంతో అధికారులు గ్రామాభివృద్ధికి మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. విద్యుత్ అధికారులు గ్రామాల్లో విద్యుత్ సమస్య లేకుండా ఎప్పటికప్పుడూ పరిష్కరించాలని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు సకాలంలో విత్తనాలు పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, కోట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మెన్ మహేందర్, ఎంపీడీవో లక్ష్మయ్య,తహసీల్దార్ ఫహిం ఖాధ్రి,గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.