Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్. మహిపాల్
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'అగ్నిపధ్' పథకాన్ని సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తున్నట్టు సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్. మహిపాల్ అన్నారు.శుక్రవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. సికింద్రాబాద్ కాల్పుల్లో మృతి చెందిన యువకునికి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగేండ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతితో సైనికులను రిక్రూట్ చేయడం వల్ల వృతి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదనీ పేర్కొనడం, పెన్షన్ డబ్బును ఆదా చేసుకోవడం కోసం ఈ పథకం తేవడమంటే, ఆ వృత్తిపరమైన సాయుధ దళాల నైపుణ్యం, సామర్ధ్యంపై తీవ్రంగా రాజీపడట మేనని అన్నారు.గత రెండేండ్లుగా భారత సైన్యంలో ఎలాంటి రిక్రూట్మెంట్ లేదన్నారు. సాయుధ బలగాల్లోకి రెగ్యులర్ సైనికులను రిక్రూట్ చేసుకోవడానికి బదులు ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టు వివరించారు.ఈ కాంట్రాక్టు సైనికులు తమ నాలుగేండ్ల సర్వీస్ తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండవనీ, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు తావిస్తుందన్నారు. వారు ప్రయివేట్ మిలీషియాగా పనిచేసే పరిస్థితివైపు నెట్టబడతారన్నారు. ఇప్పటికే తీవ్రమైన ఒడుదుడుకులకు గురవుతున్న మన సామాజిక వ్యవస్థపై దీని పర్యవసానాలు మరింత ప్రమాదకరంగా ఉంటుందన్నారు. ఉపాధి భద్రతకు కనీస రక్షణ లేకుండానే అత్యున్నత త్యాగాలు చేయడానికి సిద్ధపడాలంటూ మన యువతకు పిలుపునివ్వడం నేరపూరితమైన చర్య అని ఖండిచారు. ఈ పథకం గురించి ప్రభుత్వం ప్రకటించిన మరు క్షణమే దేశంలోని వివిధ ప్రాంతాల్లో అప్పటికప్పుడు పెద్దయెత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగాయంటే ఈ పథకం పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చని వివరించారు.ఈ అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేసి, సాయుధ బలగాల్లోకి రెగ్యులర్ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎం.సుదర్శన్. లక్ష్మయ్య, యాదయ్య, శ్రీనివాస్, ప్రకాశ్, రమేశ్, అనిల్‌కుమార్, దశరథ్‌లు పాల్గొన్నారు.
అగ్ని పథకాన్ని వెంటనే రద్దు చేయాలి
సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం. చంద్రమోహన్
రాజేంద్రనగర్‌లో..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'అగ్నిపధ్' పథకాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం. చంద్రమోహన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కాటేదాన్ చౌరస్తాలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగేండ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్ చేయడం వల్ల వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదన్నారు. పెన్షన్ డబ్బును ఆదా చేసుకోవడం కోసం ఈ పథకం తేవడమంటే వృత్తిపరమైన సాయుధ దళాల నైపుణ్యం, సామర్ధ్యంపై తీవ్రంగా రాజీపడటమేనని ఆయన అన్నారు.గత రెండేండ్లుగా భారత సైన్యంలో ఎలాంటి రిక్రూట్మెంట్ లేదు. సాయుధ బలగాల్లోకి రెగ్యులర్ సైనికులను రిక్రూట్ చేసుకోవడానికి బదులు ఈ పథకాన్ని తీసుకొచ్చిందనీ, దీనివల్ల కాంట్రాక్టు సైనికులు తమ నాలుగేండ్ల సర్వీస్ తర్వాత ఎలాంటి ఉపాధి అవ కాశాలు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ప్రయివేట్ మిలీషియాగా పనిచేసే పరిస్థితివైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలి పారు. ఇప్పటికైనా 'అగ్ని పథకం' తక్షణమే రద్దు చేసి, సాయుధ బలగాల్లోకి రెగ్యు లర్ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రుద్ర కుమార్,సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు శేఖర్, ప్రేమాజి, ప్రవీణ్, సచిన్ , భాస్కర్, పుట్టు సింగ్, వంకసింగ్ , రాహుల్, దత్తు, రాజు తదితరులు పాల్గొన్నారు.