Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడీఏ సత్యనారాయణ
నవతెలంగాణ-మంచాల
పత్తి పంటలో మొక్కల అధిక సాంద్రతతో విత్తడంతో అధిక దిగుబడి వస్తుందని ఏడీఏ సత్య నారాయణ అన్నారు. శుక్రవారం మంచాల రైతు వేదికలో పత్తి వేసే రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పత్తిని అధిక సాంద్ర తతో విత్తడం ద్వారా అధిక దిగుబడి వస్తుంద న్నారు.నూతన సాంకేతిక ప్రయోగాన్ని క్షేత్ర స్థాయిలో 45 వేల ఎకరాల్లో చేయాలని నిర్ణయిం చిందనీ, అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు క్రింద ఇబ్రహింపట్నం జిల్లాలోని మండలంలో తాల్లపల్లిగూడ, లింగంపల్లి, ఆరుట్ల రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆ పంటలో వరుసల మధ్య 75 సెంటి మీటర్లు, మొక్కల మధ్య 15 సేంటి మీటర్లు ఉండేటట్లు ఒక ఎకరాకు 26000 వేల పై చిలుకు పత్తి విత్తనాలు విత్తాలని సూచిం చారు. దీంతో అధిక సాంద్రతతో విత్తడం వల్ల ఎకరాకు 10క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనలో నిరూపితమైనట్టు తెలిపారు. ఈ ప్రయోగంలో భాగస్వాములైన రైతులకు ఎకరాకు రూ.4 వేలు ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జ్యోతిశ్రీ, ఏఈవోలు సాయిశ్రీ,సరిత, లింగస్వామి, పత్తి రాశీ కంపెనీ ప్రతినిధి నవీన్ కుమార్, రైతులు పాల్గొన్నారు.