Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్పల్లి
ప్రభుత్వం గ్రామాల్లో నిర్మించిన క్రిమిటోరియాల్లో 18వ తేదీ వరకు విద్యుత్, నీటి సదుపాయం తప్పనిసరిగా కల్పించాలని డీఎప్పీవో అనిత అన్నారు. శుక్రవారం మండలంలోని భూచన్ పల్లి గ్రామాన్ని ఆమె సందర్శించి, అన్ని గ్రామాల్లో పనులు పూర్తి చేయాలన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో చేపడుతున్న మరమ్మతుల పనులు పరిశీలించారు.
రూ.35 లక్షలతో పాఠశాల పనుల కోసం టెండర్
భూచన్పల్లి జిల్లా పరిషత్ పాఠశాల మరమ్మతు పనుల కోసం లైసెన్స్ కలిగిన ఎస్సీ వర్గానికి చెందిన వారు టెండర్ వేసుకోవాలని డీఎల్సీవో అనిత తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.35 లక్షలతో మరమ్మతు పనుల కోసం అర్హత కలిగిన వారు వెంటనే టెండర్ వేసి పనులు దక్కించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుడు మధుకర్,కార్యదర్శి లక్ష్మీకాంత్, ఉపాధ్యాయుడు అరవింద్ తదితరులు ఉన్నారు.