Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి
నవతెలంగాణ-శంకర్పల్లి
మొక్కలు నాటి, వాటిని సంపరిరక్షించడం ద్వారానే పర్యావరణాన్ని పరిరక్షించాలని శంకర్పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి అన్నారు. పల్లె ప్రకృతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని గోపులారం గ్రామంలో స్కూల్ ఆవరణలో ఎంపీడీవో వెంకయ్య, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాస్‌తో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. తల్లిదండ్రులు కూడా సమాజంలో భాగస్వాములు కావాలన్నారు. వచ్చే వర్షాకాలంలో రోగాల నివారణకు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీ యమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా 40 మంది విద్యార్థినిలకు పొదుపు చేసుకునేందుకు పాఠశాల ఉపాధ్యా యులు, సామాజిక కార్యకర్త పాపగారి ఆశీర్వాదం తన సొంత డబ్బులతో విద్యార్థినిలకు రెండు వందల రూపాయలతో పొదుపు ఖాతా తెరిచిపించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొండ మల్లమ్మ, వార్డు సభ్యులు రమేష్, శివలీలా సత్యనారాయణ,ఏపీఓ నాగ భూషణం, గ్రామ ప్రత్యేక అధికారి శేషగిరి, గ్రామ కార్యదర్శి సుదర్శన్, పాఠశాల ప్రధానో పాధ్యాయులు లక్ష్మీకాంతరావు,ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.