Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. శుక్రవారం కందుకూరు గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్లో బడి బాట కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ కర పత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేం డ్లు దాటిన బడీడు పిల్లలందరిని తప్పనిసరిగా బడిలో చేర్పించా లన్నారు.తల్లీదండ్రులు చొరవ తీసుకుని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిం చాలని కోరారు.మెరుగైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల దుస్తులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహే శ్వరం మార్కెటింగ్ చైర్పర్సన్ సురసాని వరలక్ష్మి సురేందర్ రెడ్డి, కందు కూరు సర్పంచ్ శమంతకమణీ, ప్రధానోపాధ్యాయులు మురళీమోహన్, ఉపాధ్యాయులు, సీ ఆర్ పీ వెంకటేష్, నాయకులు సురసాని జైపాల్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.