Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు రూరల్
మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేధింపులు అరికట్టాలని శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో తాండూరు మండల విద్యాధికారికి మధ్యాహ్న భోజన కార్మికులు వినతిపత్రం అందజేశారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికుల నాయకురాలు భారతమ్మ, నర్సమ్మ మాట్లాడుతూ తాండూరు పట్టణం సాయిపూర్ బెగ్గర్ కాలనీ10వ వార్డులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న ఫాతిమా బేగంను స్కూల్ హెచ్ఎం కొంత మంది రాజకీయ నాయకులు దౌర్జన్యంగా తొలగించడం సరైంది కాదన్నారు. గత 20 ఏండ్ల నుంచి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులుని అక్రమ తొలగింపులు వెంటనే ఆపాలని కోరారు. వార్డు కౌన్సిలర్ తనకు అనుకూలమైన వారిని పెట్టాలనే ఉద్దేశంతో ఫాతిమా బేగంను రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న స్కూల్ హెచ్ఎంపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియేడల కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.