Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహ్మద్ అలీఖాన్ బాబర్
నవతెలంగాణ-షాద్ నగర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నల్లోనే పోలీస్ వ్యవస్థ నడుస్తుందని, రాజ్‌భవన్ ముట్టడి సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహ్మద్ అలీఖాన్ బాబర్ అన్నారు.శుక్రవారం షాద్ నగర్ పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా మహ్మద్ అలీఖాన్ బాబర్ మాట్లాడుతూ సోనియా, రాహుల్ గాంధీలపై ఈడి కేసులు ఎత్తి వేసే వరకూ పోరాడతామన్నారు. ప్రధాన మంత్రి, కేసీఆర్ ఒకటై కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారని ఆరో పించారు. పోలీసులు సీఎం కేసీఆర్ చెప్పిందల్లా వింటే సరిపోదని, పోలీ సులు ప్రజల రక్షణ కోసం ఉన్నారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, చౌదరిగుడా మండల అధ్యక్షులు రాజు, మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పురుషోత్తం రెడ్డి, ఐఎన్టీయూసీ రఘు, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందే మోహన్, యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ అర్జున్ లక్ష్మణ్, ఖదీర్, యాదయ్య, శ్రీధర్, సుదర్శన్, అంజి యాదవ్, గోపాల్ ముదిరాజ్, బుడ్డ నరసింహ, పుల్లారెడ్డి, శ్రీధర్, ప్రదీప్, సాయి వంశీ, అనిల్, శేఖర్, అశోక్, కొత్తూరు నర్సింలు, అజ్మత్ ఖాన్, గంగమోని సత్తయ్య, అందే శ్రీ కాంత్, శ్రీనాథ్, ప్రవీణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.