Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ యాదగిరి
నవతెలంగాణ-శంకర్పల్లి
అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ యాదగిరి, టౌన్ ప్లానింగ్ అధికారి భాస్కర్ హెచ్చరించారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని శ్రీరామ కాలనీ,హనుమాన్ నగర్ కాలనీలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై శుక్రవారం మున్సిపల్ సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారిపైనైనా వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీ రామ్ నగర్ కాలనీ హనుమాన్ నగర్ కాలనీలో సుధాకర్ , నాగరాజు, సత్తయ్యకు చెందిన మూడు భవనాలను కూల్చివేసినట్టు తెలిపారు.అక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది రాజుకుమార్, సురేందర్, శశాంత్ తదితరులు ఉన్నారు.