Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
నవతెలంగాణ-కొత్తూరు
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిందని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని ఎస్బిపల్లి గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఎస్బి పల్లి గ్రామానికి చెందిన ఎం.చెన్నయ్య రెండు లక్షలు, సిద్దాపూర్ గ్రామానికి చెందిన డి. సాలయ్యకు లక్ష రూపాయల ఎల్ఓసీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిరుపేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. జబ్బు పడ్డ నిరుపేదలు సరైన వైద్యం చేయించుకునేం దుకు వీలుగా ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మరే ఇతర రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, సర్పంచ్ అంబటి ప్రభాకర్, ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, నాయకులు ఎమ్మె సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మెండె కృష్ణయాదవ్, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు కడల శ్రీశైలం, ఉప సర్పంచ్ బాలరాజ్, కో-ఆప్షన్ సభ్యులు లింగా రపు సురేష్‌గౌడ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.