Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పరిగి
అగ్నిపథ్‌ను రద్దు చేయాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంక టయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'అగ్నిపధ్' పథకాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, దీనివల్ల దేశ జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని, సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన యువకునికి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని శుక్రవారం పరిగి పట్టణ కేంద్రంలోని బస్ స్టాండ్ ఎదుట నేషనల్ హైవేపై పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్ చేయడం వలన వృత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదని పేర్కొన్నారు. పెన్షన్ డబ్బును ఆదా చేసుకోవడం కోసం ఈ పథకం తేవడమంటే మన వృత్తిపరమైన సాయుధ దళాల నైపుణ్యం, సామర్ధ్యంపై తీవ్రంగా రాజీపడడమేనని అన్నారు. రెండేళ్లుగా భారత సైన్యంలో ఎలాంటి రిక్రూట్మెంట్ లేదని, సాయుధ బలగాల్లోకి రెగ్యులర్ సైనికులను రిక్రూట్ చేసుకోవడానికి బదులు ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. దీని వలన కాంట్రాక్టు సైనికులు తమ నాలుగేళ్ల సర్వీస్ తర్వాత ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకుండా మిగిలిపోతారన్నా రు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు తావిస్తుం దని అన్నారు. ఇప్పటికే తీవ్రమైన ఒడుదుడుకులకు గురవుతున్న మన సామాజిక వ్యవస్థపై దీని పర్యవసా నాలు మరింత ప్రమాదకరంగా ఉంటాయిన పేర్కొన్నారు. సాయుధ బలగాల్లోకి రెగ్యులర్ రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎండీ హబీబ్, బసిరెడ్డి, లాలయ్య, శేఖర్, వెంకటయ్య, బాలు,శీను, ప్రశాంత్, ఆసిద్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.