Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిని లలిత కుమారి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
పౌష్టిక లోపం ఉన్న పిల్లలను నార్మల్ స్థాయికి తీసుకురావడమే లక్ష్యం అని మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిని లలిత కుమారి అన్నారు. మహిళా శిశు వికలాంగుల, వమోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో సూపర్వైజ్డ్ సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాంలో భాగంగా స్థానిక డీపీఆర్సీ భవన్, మద్గుల్ చిట్టెంపల్లిలో సీడీపీఓల కు, సూపర్వైజర్లకు, హెల్త్ సూపర్వైజర్లకు శిక్షణా కార్య క్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యునిసెఫ్ ప్రతినిధులు నరసింహారావు, రాకేష్‌లు హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ పిల్లలలో తీవ్ర పోషణ లోపం, అతితీవ్ర పోషణ లోపాలను గుర్తించి నార్మల్ స్థాయిలోకి తీసుకు రావడం, పిల్లలు పౌష్టికాహార లోపం వల్ల సమస్యల వలన పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం లాంటి సమస్యలను పరిష్కరిం చేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8.4శాతం మంది అతి తీవ్ర లోప పోషణతో బాధపడుతు న్నారని వీరందరినీ నార్మల్ స్థాయిలోకి తీసుకురావడం కోసం కార్యక్రమాలు నిర్వహిం చి, సిబ్బందికి అవగాహన కల్పిస్తామన్నారు. 7 నెలల వయస్సు నుండి 59 నెలల పిల్లలు ఈ సమస్యతో బాధపడుతుంటారని వీరిని గురిగించేందుకు రెగ్యులర్‌గా వీరి బరువును పరిశీలిం చడం, ఆకలి పరీక్ష చేయించడం, ఆరోగ్య పరీక్షలు చేయాలన్నారు. ఈ సందర్బంగా యూనిసెఫ్ కన్సల్టెంట్ నరసింహారావు మాట్లాడుతూ ఎత్తుకు తగ్గ బరువు లేకుండా పిల్లలకు 6 నెలల నుంచి 59 నెలల మధ్య వ యసున్న పిల్లలకు బాలామృతం ప్లస్, మంచి పోషకా హారం, సరైన వైద్యం ఇచ్చి ఆ పిల్లల్ని నార్మల్ స్థాయికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమం ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండి ఎటువంటి అనారో గ్యాలకు గురి కాకుండా మంచి పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం ద్వారా పిల్లల్లో గ్రోత్ మరీ ఎదుగుదల స్థాయి బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమములో మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ లు కృష్ణవేణి, ప్రియద ర్శిని, వెంకటేశ్వరమ్మ, విజయలక్ష్మి, హెల్త్ డిపార్ట్మెంట్ లక్ష్మి మేడం, సూపర్వైజర్లు, హెల్త్ సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.