Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుమ్మరిగూడ గ్రామ సర్పంచ్ కేతన రమేశ్
నవతెలంగాణ-షాబాద్
ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కుమ్మరిగూడ గ్రామ సర్పంచ్ కేతన రమేశ్ యాదవ్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని కుమ్మరిగూడ గ్రామంలో కామినేని ఆస్పత్రి ఆధ్వర్యం లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి, గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులు ఉచితంగా వైద్య సేవలు అందించడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులున్నారు.