Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్రకుమార్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
శివరాంపల్లి స్టీల్ కంపెనీలో పని చేస్తున్న సంజుసింగ్ కార్మికుడికి ప్రమాదవశాత్తు స్టీల్ రాడ్స్ పైన పడడంతో అతని చెయ్యి, కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయనీ, ఆయనకు నష్టపరిహారం చెల్లించాలని కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్ర కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం సంజు సింగ్ కార్మికుడిని కాటేదాన్ క్లస్టర్ కన్వీనర్ రుద్ర కుమార్, కోశాధికారి భాస్కర్ పరామర్శించారు. ఈ సందర్భంగా రుద్రకుమార్ మాట్లాడుతూ కంపెనీ యాజ మాన్యం కార్మికునికి నామమాత్రపు చికిత్స చేయించి చేతులు దులుపు కుందన్నారు. కార్మికుని కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉందనీ, కంపెనీ యాజమాన్యం స్పందించి అతనికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాలు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం అతడు పని చేయలేని పరిస్థితిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ యాజ మాన్యం నష్టపరిహారం చెల్లించే వరకూ సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.