Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 ఎకరాల ఈనాం భూమిని గుంజుకుంటున్న అగ్రవర్ణాలు
- సర్వే నెంబర్ 71 లో 14 ఎకరాలు సాగు చేసుకుంటున్న దళితులు
- అధికారుల అండతో వారిని బెదిరింపులకు పాల్పడుతున్న రెడ్డిలు
- పశువుల పాకను దగ్ధం చేసిన దుండగలు
- కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సామేలు
నవతెలంగాణ-యాచారం
గత కొన్నేండ్లుగా భూమిని సాగు చేసుకుంటూ సాగిస్తున్న దళిత కుటుంబాల ఈనాం భూమిని అగ్రవర్ణాల నుంచి ప్రభుత్వం కాపాడాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బోడ సామెల్ డిమాండ్ చేశారు. సోమవారం యాచారం మండల పరిధిలోని కొత్తపల్లిలో సర్వే నెంబర్ 71 ప్రకారం14 ఎకరాల ఇనాం భూమిని యాభై దళిత కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ గ్రామానికి చెందిన కొంతమంది భూస్వా ములు అధికారుల అండదండలతో కౌలు కింద కొందరికి ఇచ్చామనీ, ఆ రికార్డులను వారి పేరుపై చేయించుకుని దగా చేశారని కొంతమంది దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల అండతో పదేపదే బెదిరిస్తున్నారని సంబంధిత రైతులు, కేవీపీఎస్ నాయకులతో వారి గోడు వెల్లబోసు కున్నారు.దళిత రైతులకు మద్దతుగా నాయకులు కొత్తపల్లి గ్రామంలో పర్యటించారు. సాగు చేసుకుంటున్న భూమిలో అగ్రవర్ణాలు పశువుల పాకను తగులబెట్టారని తెలిపారు. వీరికి మద్దతుగా కేవీపీఎస్ నాయకులు సామేలు మాట్లాడుతూ దళితుల భూమిలో పశువుల పాకను తగులబెట్టిన దుండగులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంత మంది అవినీతి అధికారుల అండదండలతో రెడ్డి కులస్తులు దళితుల భూములను గుంజుకుని రికార్డులను తారుమారు చేశారని ఆరోపించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన అగ్రవర్ణాలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. ప్రభుత్వం ఇచ్చిన ఈనామ్ భూమిని సాగు చేసుకుంటూ 50 కుటుంబాలు బతుకుతున్నాయని చెప్పారు. కొత్త పళ్లిలో దళిత కులానికి చెందిన చిక్కుడు యాదయ్య సాగు చేసుకుంటున్న భూమిలో ఆ గ్రామానికి చెందిన కొంతమంది రెడ్డిలు పశువుల పాక ను తగలబెట్టడం దుర్మార్గమన్నారు. ఈ తప్పుడు రికార్డులను సూచించి 14 ఎకరాల భూమిని లాక్కోవాలని కొంత మంది రెడ్డిలు ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. ఇప్పటికైనా పోలీసులు వారిపైన చట్ట పరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని సామేలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, కేవీ పీఎస్ నాయకులు ఆలంపల్లి నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అంజయ్య, కొత్తపల్లి ఉపసర్పంచ్ కవలి జగన్, రైతు సంఘం మండల కార్యదర్శి ఎంపీ నరసింహ, దళిత నాయ కుడు చిక్కుడు గుండాలు, జంగయ్య, మొగిలయ్య, వెంకటేష్, యాదయ్య, కృష్ణ, శివ, హలో కుమార్, సైదులు పాల్గొన్నారు.