Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
- రూ.75 లక్షల నిధులతో శంకుస్థాపనలు
నవతెలంగాణ-కందుకూరు
గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని దన్నారం గ్రామంలో రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన, మురళి నగర్ గ్రామంలో ఎస్టీ నిధులు రూ. 55 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీపీ మంద జ్యోతి పాండుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పటిష్టత కోసం పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మిషన్ భగీరథ , అండర్ గ్రౌండ్ డ్రయినేజీ నిర్మాణ పనులు, వీధిలైట్లు, రహదారులు నిర్మాణ పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఆయా గ్రామాల సర్పంచులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీదేవి శేఖర్ రెడ్డి, ఎంపీటీసీ సురమోని లలితకుమార్, మురళి నగర్ సర్పంచ్ సోమ్లానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కపాటి పాండురంగారెడ్డి, కందుకూరు సహకార సంఘం చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, నియోజకవర్గం ఉపాధ్యక్షులు లక్ష్మీ నరసింహ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, డైరెక్టర్లు పిట్టల పాండు, పొట్టి ఆనంద్, నాయకులు అనె గౌని దామోదర్ గౌడ్, ఆనె గౌని పాండు గౌడ్, జీ. రామయ్య, సదానందం గౌడ్, బాల మల్లేష్, తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్ రెడ్డి, రామాంజనేయులు, నవీన్ కుమార్, రామ్ చందర్, గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.