Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొయినాబాద్
మొయినాబాద్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు సులభతరమైన ప్రసవ వ్యాయామాలపై అవగాహనా సదస్సు సోమవారం నిర్వహించారు. శిక్షణ నిపుణులు ఉమామహేశ్వరి, సునీత సామాజిక ఆరోగ్య అధికారి టి.నర్సింగరావు మాట్లాడుతూ గర్భిణులకు బాలన్స్డైట్ సమతుల పోషకాహారం, ఐరన్, కాల్షియం మాత్రలు అవ శ్యకత గురించి నిర్ణిత సమయంలో వైద్య పరీక్షల గురించి వివరించినట్టు తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలా సంఖ్య పెంచాలన్నారు. వర్షాకా లంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల శుభ్రత పాటించాలని సూచించారు. అంతేకాకుండా దోమలు వృద్ధి చెందకుండా టైర్లు, పాత సామానులు, కొబ్బరి చిప్పలు మొదలైనవి లేకుండా చూసుకోవాలని, పూల కుండీలు కూలర్స్ మొదలగు పాత్రలలో నీరు నిల్వ లేకుండా శుభ్రంగా ఉండే విధంగా జాగ్రత్త పడాలని చెప్పారు.దోమ తెరలు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలన్నారు. ఫ్రైడే డ్రై డేగా పాటించి నిల్వ ఉన్న నీటిని పారవేయాలని ఎప్పటికప్పుడూ పరిశుభ్రత పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యులు, పర్యవేక్షక సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.