Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి మున్సిపల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ కోటి రూపాయల నిధులతో బుల్కాపూర్ శ్మశాన వాటిక , సీసీరోడ్డు, నందు ఆర్.ఆర్ఎన్ బీ గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్, వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ పునాది కోసం రూ.2 కోట్లు, టీయూఎఫ్ఐడీసీ రూ.10 కోట్లతో పట్టణ పరిధిలోని వివిధ వార్డు లలో భూగర్భ మురుగునీటి కాలువలు, సీసీరోడ్డు వర్షపు నీటికాలువల నిర్మా ణాల కోసం ప్రారంభోత్సవం, ఎంపీ ల్యాండ్స్ విధులు రూ. 13.60 లక్షలతో 11 వ వార్డులో హైదరాబాద్ రోడ్డు నుంచి పాన్‌షాపు ఇబ్రహీం ఇంటి వరకూ సీసీరోడ్డును చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యలతో కలసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో మున్సిపల్‌కు మహర్దశ రానున్నట్టు ఆమె వివరించారు.శంకర్పల్లి మున్సిపల్‌కు అభివృద్ధి పనుల కోసం రూ.15 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసినట్టు వెల్లడించారు.టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయ లక్ష్మి ప్రవీణ్ కుమార్, శంకర్పల్లి ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు శ్వేతా పాండురంగారెడ్డి, రాధా బాలకృష్ణ, వాణిప్రకాష్ గుప్తా, చంద్రమౌళి, లావణ్య శ్రీనివాస్ రెడ్డి, సంధ్యారాణి అశోక్ కుమార్, సిహెచ్ అశోక్, సంతోష్ రాథోడ్, లక్ష్మమ్మ రామ్‌రెడ్డి,గోపాల్, కో-ఆప్షన్ సభ్యులు రజిని శ్రీనివాస్, మహమూద్, వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కావాలి గోపాల్, మున్సిపల్ అధ్యక్షులు వాసుదేవ్, సొసైటీ చైర్మెన్ శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు రవీందర్ గౌడ్, నాయకులు విట్టలయ్య, మహేందర్ రెడ్డి,గోవర్ధన్ రెడ్డి, తహసీల్దార్ నయీమద్దీన్, మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ యాదగిరి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.