Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలి
- బీసీ కన్వీనర్ రాజ్‌కుమార్ కందుకూరి
నవతెలంగాణ-తాండూరు
బీసీల అభివృద్ధి చెందాలంటే మహిళల భాగ స్వామ్యం చాలా అవసరమని కన్వీనర్ రాజ్‌కుమార్ అన్నారు. సోమవారం తాండూరు పట్టణ కేంద్రం లోని హిమాలయ హౌటల్ లో బీసీ సంఘం సమావేశం నిర్వహించింది. బీసీ మహిళా కార్యవర్గ సమావేశంలో రాజ్ కుమార్ కందుకూరి నూతన బీసీ మహిళా కార్యవర్గాన్ని ప్రకటించారు. తాండూరు పట్టణం బీసీ మహిళా కార్యవర్గ సమా వేశం తాండూర్ నియోజవర్గం బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో బీసీ మహిళ కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ కన్వీనర్ రాజ్‌కుమార్ కందుకూరి మాట్లాడుతూ తాండూర్ చరిత్రలో బీసీ మహిళా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నడం అభినందనీయమన్నారు. బడుగు బలహీనవర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర కీలకమన్నారు. మహిళలందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి, బీసీల అభివృద్ధికి మహిళల భాగ స్వామ్యం కావాలని కోరారు. రాబోయే రోజుల్లో బీసీ సంఘం పిలుపు మేరకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు బీసీ మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే తాండూర్ నియోజక వర్గంలో ఒక బీసీ సమీకృత భవనం నిర్మించేందుకు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై ఒత్తిడి పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ షుకూర్, బీసీ మహిళా అధ్యక్షురాలు జ్యోతి, జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్, యలాల్ మండల అధ్యక్షులు లక్ష్మణా చారి, తాండూర్ మండల అధ్యక్షులు బసంత్, గుంటుపల్లి వెంకట్ మాట్లా డుతూ.. జాతీయ స్థాయి అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ రాజ్‌కుమార్ నేతృత్వంలో రాజకీయ పార్టీ లకు దీటుగా, ప్రభుత్వంపై అనేక ఉద్యమాలు, ధర్నా లు చేపట్టి విద్యార్థులకు, కులవృత్తులకు, ప్రయివేట్ ఉపాధ్యాయులకు గురుకుల పాఠశాలల ఉపాధ్యా యులకు ఎంతో మేలు చేసినట్టు గుర్తు చేశారు. ఇప్పుడు ఒక మహిళా కార్యవర్గంతో తాండూరు ప్రాంతంలో బీసీల అందరికీ న్యాయం జరుగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యువ నాయ కులు టైలర్ రమేశ్, తాండ్ర నరేశ్, రజక నరసింహా, బస్సు జగదీశ్, శివ మతిన్, మహదేవ్ పాల్గొన్నారు.