Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీకేఎస్ జిల్లా కార్యదర్శి బోయపల్లి సుధాకర్ గౌడ్
- జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా
- జాయింట్ కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ -రంగారెడ్డి ప్రతినిధి
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కేజీకేఎస్ జిల్లా కార్యదర్శి బోయపల్లి సుధాకర్‌గౌడ్ డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చే స్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిం చారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు నాలుగేండ్ల నుంచి పెండింగ్‌లో పెట్టిన పింఛన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృత్తిలో ప్రమాదం జరిగిన వారికి ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంలో ప్రభుత్వం మీన మేశాలు లెక్కిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనాలు వెంటనే ఇవ్వాలన్నారు. టాడి కార్పొరేషన్‌కు కేటాయించిన బడ్జెట్ వెంటనే విడుదల చేసి గీత కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలన్నారు. గీత కార్మికుల ఉపాధి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున గీతన్న బందు ఇవ్వాలని కోరారు. ప్రతి సొసైటీకి చెట్ల పెంపకానికి ఐదు ఎకరాల భూమి కొని ఇవ్వాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేసి యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తాటి చెట్లు నరికిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల న్నారు. అదే విధంగా ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని, కమ్యూనిటీ భవనాలు నిర్మించాలన్నారు. హరితహారంలో పొట్టి వంగడాలు తాటి, ఈత, ఖర్జూర, జిలుగు చెట్లను నాటాలని అన్నారు. కోటి వరాల కార్యక్రమంలో ఇచ్చిన గీత కార్మికుల భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు సొసైటీ పేరుమీద ఇవ్వాలని కోరారు. మెడికల్ బోర్డు విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ముదేంటి యాదయ్య, తుర్కాయంజల్ సొసైటీ అధ్యక్షులు మారగోని వెంకటేశ్ గౌడ్, ఉపా అద్యక్షులు గౌని రాజుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.