Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి
- సీపీఐ రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రజలతో మమేకమై ప్రజాసమస్యలపై పోరాడుతున్న సీపీఐ 3వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ శ్రేణులకు రాష్ట్ర ఇన్చార్జి కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నగరంలో సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం సీనియర్ నాయకులూ పుస్తకాల నర్సింగ్ రావు అధ్యక్షతన నిర్వచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మూడేండ్లకు జరిగే రాష్ట్ర 3వ మహాసభలు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సెప్టెంబర్ 4 నుంచి 7 తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఎంపికైన 800 ప్రతినిధులు, ప్రత్యాన్మాయ ప్రతినిధులు, ఉద్యమాల ద్వారా పార్టీకి జీవితాలను అంకితం చేసిన కమ్యూనిస్టు యోధులు, ప్రత్యేక ఆహ్వానితులు, వాలంటీర్లు ఈ మూడు రోజులు జరిగే మహాసభలలో పాల్గొంటారని తెలిపారు. రెడ్ షర్ట్స్ వాలంటీర్స్ కవాతు అనంతరం వేలాదిమందితో భారీ బహిరంగ సభ ఉంటుందని అయన వెల్లడించారు. సమాజంలో సామాన్య రైతు, చిన్న వ్యాపారస్తులు, వత్తి మీద, శారీరక శ్రమ మీద ఆధారపడి బతుకులీడుస్తున్న పేద, బడుగు బలహీనుల జీవన ప్రమాణాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు గడచినా ఎనిమిదేండ్లలో సాధించిన ప్రగతిని, ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలు, ప్రజల జీవన పరిస్థితులను సమీక్షించి ఈ మహాసభలలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఈ మహాసభలను జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్, పార్లమెంటరీ పక్ష నాయకులూ ఎంపీ బినోరు విశ్వం, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిలు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రవీంద్ర చారి, రాష్ట్ర సమితి సభ్యులు సయ్యిద్ అఫ్సర్, ముత్యాల యది రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభులింగం, ఓరుగంటి యాదయ్య, ఫామీద తదితరులు పాల్గొన్నారు.