Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శంకర్పల్లి సీఐ మహేశ్‌గౌడ్
నవతెలంగాణ-శంకర్పల్లి
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరా లు అధిరోహించాలని శంకర్పల్లి సీఐ మహేష్‌గౌడ్ అన్నారు. సోమవారం ఎన్కతల బాగయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. పర్వేద గ్రామానికి చెందిన ఎన్కతల రవీందర్ గౌడ్ తన తండ్రి జ్ఞాపకార్ధంగా ఎన్కతల బాగయ్యగౌడ్ ట్రస్టు తరఫున పర్వేద జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలకు సింగాపురం, టవర్ ప్రాథమిక పాఠశాలలకు నోట్ బుక్స్, పెన్సిల్స్, జియో మెట్రిక్ బాక్స్, రేటింగ్ ప్యాడ్లను అందించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సమాజ సేవ చేయడం మాటల్లో కాకుండా చేతల్లో చూపించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటు వంటి పేద విద్యార్థులకు ఈ విధంగా సహకరించడం గొప్ప విషయమని ట్రస్ట్ వారిని అభినందించారు. అలాగే విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరో హించాలని సూచించారు. ఎలాంటి చెడు మార్గాలకు అలవాటు పడకుండా అమ్మ నాన్న, ఉపాధ్యాయులు చెప్పినట్టుగా నేర్చుకొని ఉన్నతమైనటువంటి మార్గంలో నడిచి పది మందికి ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద వి ద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించి విద్యను ప్రోత్సహి స్తున్న బాగయ్యగౌడ్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన, నాణ్యమైన విద్య లభి స్తుందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధనా ప్రారంభం అయిందని మండల విద్యాధికారి అక్బర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బాగయ్య గౌడ్ ట్రస్ట్ వారు రవీందర్‌గౌడ్, సురేందర్‌గౌడ్, రామ్ చందర్‌గౌడ్, మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్, పర్వేద సర్పంచ్ అనిత సురేందర్‌గౌడ్, ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్త ప్రేమ్‌కుమార్‌గౌడ్, రాములు, రాంచందర్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.