Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్
- అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరభ్యాసం
నవతెలంగాణ- యాలాల
బడీడు చిన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు చేర్పించాలని యాలాల సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం బడిబాటలో కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం అంగన్వాడీ కేంద్రంలో చిన్న పిల్లలకు సామూహిక అక్షరభ్యాసం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.. ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. బాలింతలకు, గర్భిణులు, చిన్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని సమయానికి అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.