Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె నిఖిల
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ప్రజావాణిలో వచ్చిన భూ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత తహసీల్దార్లు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. సోమవా రం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 140 ఫిర్యాదులు స్వీకరిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్య పరిష్కారం నిమిత్తం చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. నెల 15 రోజులుగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పాటు ఇతర అత్యవసర పనుల కారణంగా కమిటీ సమావేశాలు నిర్వహించనందున దాదాపు 1900 జీఎల్ఎం కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వీటి పరిష్కారం కొసం మండలాల వారిగా కమిటీ సమావేశాలు నిర్వహించి త్వరగా భూ సమస్యలు పరిష్కరించునున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈనెల 30 వరకు ప్రతి పెండింగ్ దరఖాస్తు వివరాలు సిద్ధం చేసి అందజేస్తే జులై 1 వరకు అన్ని దరఖాస్తులు క్లియర్ చేసేందుకు వీలు పడుతుందన్నారు. జిల్లాలో సర్వే సమస్యలు, ఫారెస్ట్ భూ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. సర్వయర్లను పిలుపించుకొని ఇట్టి పెండింగ్ పనులను ఆన్లైన్లో అప్లోడ్ చేసినట్లయితే క్లియర్ చేయుటకు వీలు పడునని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిని విజయకుమారి, జిల్లా అటవీ శాఖ అధికారి వేణుమాధవ రావు, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ ఏడి రాంరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి అమరేందర్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.