Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాంపస్ సెలక్షన్స్‌కు విశేష స్పందన
- సింధు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ దేవి రంగారావు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలోని సింధు డిగ్రీ కళాశాలలో శుక్రవారం మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలోని వివిధ సంస్థల ద్వారా సింధు డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సింధు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ దేవి రంగారావు మాట్లాడుతూ..విద్యతో పాటు యువతకు ఉపాధి కల్పించేందుకు కషి చేయడం జరుగుతుందని అన్నారు. కళాశాలలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనుబంధ సంస్థలు విప్రో, బైజ్యూస్, మూత్తూట్ ఫైనాన్స్, టేక్ మహీంద్ర, 5కే కార్ సర్వీస్, కేఫ్ కాఫీడే, స్కైయాడ్ ఎలక్ట్రానిక్స్, విజయ బయో ఫర్టిలైజర్స్, హనర్స్ ల్యాబ్, హెచ్ డీఎఫ్సీ, ఎస్బీఐ ద్వారా విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సెలక్షన్స్ కు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 150 మంది విద్యార్థులకు ఇంటర్వూలకు హాజరుకాగ అందులో 97 మంది విద్యార్థులు ఎంపిక కావడం హర్షణీయమన్నారు.ఎంపికైన విద్యార్థులకు కళాశాల ప్రెసిడెంట్ రంగారావు, ప్రిన్సిపల్ విజయాదేవిలు సర్టిఫికెట్లను అందజేశారు.విద్యార్థులకు తరగతిలో బోధించే విద్యతో పాటు జీవితంలో రాణించే విధంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కషి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం వి ద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహిస్తామని తెలి యజేసారు.. ఈ కార్యక్రమంలో పది కంపెనీల, సంస్థల ప్రతి నిధులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తది తరులు పాల్గొన్నారు.