Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్పంచ్ ముద్వెంటి సులోచన సాయిలు
నవతెలంగాణ-ఆమనగల్
నీలి నాలుక వ్యాధి వ్యాపించకుండా గొర్రెలు, మేకల పెంపకం దారులు తమ జీవాలకు టీకాలు తప్పక వేయిం చాలని సర్పంచ్ ముద్వెంటి సులోచన సాయిలు అన్నారు. శుక్రవారం కడ్తాల్ మండలంలోని మక్తమాధారం గ్రామం లో పశు వైద్య అధికారులు జీవాలకు నీలి నాలుక వ్యాధి నిరోధక టీకాలు వేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సులోచన సాయిలు పాల్గొని మాట్లాడారు. గొర్రెలు, మేకల పెంపకం దారులు పశం వైద్య అధికారుల సలహాలు సూ చనలు పాటించి తమ జీవాలను సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బండి మంజుల చంద్రమౌళి, ఉపసర్పంచ్ గణేష్, ఏఎంసీ డైరెక్టర్ నర్సింహ, వార్డు సభ్యులు జెనిల్, మహేం దర్, యాదగిరి, కవిత, పశు వైద్య అధికారులు రాజేశ్వర్ రావు, మహమ్మద్ అప్సర్, గొర్రెలు, మేకల పెంపకం దారులు పాల్గొన్నారు.