Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
పులికొండ సుబ్బాచారి రచించిన మాదిగ కొలుపు నవలను హెచ్సీయూలోని లైఫ్ సైన్సెస్ సమావేశ మం దిరంలో ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం ఆవిష్కరించా రు. ఆచార్య పులికొండ సుబ్బాచారి చేసిన పరిశోధనను ఒక నవలగా తీర్చిదిద్దారని, కుల, మత విషయాలన్నీ మనిషి ఆకలి కేకల ముందు నిలవవనీ, పుస్తకంలోని వేదనను మా త్రం అర్థం చేసుకోవాలన్నారు. నవలను చదివించే కథనం తో రాశారని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. దళితుల సాంస్కృతిక జీవనాన్ని దీనిలో ప్రతిఫలించారని పేర్కొ న్నారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ నేటికీ సమాజంలో ఉన్న అనేక కులసమస్యల్ని చిత్రించారని చెప్పారు. సమావేశానికి స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య వి.కృష్ణ అధ్యక్షత వహించారు. పుస్తకాన్ని తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య పిల్లలమర్రి రాములు, ప్రముఖ కథారచయిత్రి జూపాక సు భద్రలు మాట్లాడారు. సమావేశంలో హెచ్సీయూ పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య అప్పారావు పొదిలె, సిడాస్ట్ హెడ్ ఆచార్య విష్ణు సర్వదే, ప్రముఖ రచయితలు శ్యామ్ ప్రసాద్, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.